Mohan babu | టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై పహాడీ షరీష్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయ్యింది. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు గురువారం నాడు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్ట్‌లో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా.. ఈ పిటిషన్‌ను నేడు విచారించిన ధర్మాసనం పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది.