Rakesh Reddy | రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించడంతో, ఇదే అంశంపై మెజారిటీ ప్రజల విశ్వాసాలను కాపాడటం కోసం, రాజన్న కోడెల విశిష్ఠత కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో ఈరోజు వేములవాడలో స్థానిక నాయకులతో కలిసి శాంతి హోమం జరిపించినట్లు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
పరమ శివుడు, ఆదిదేవుడు, రుద్రేశ్వరుడు వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించిన పాపానికి, పాప ప్రక్షాళన కోసం, ప్రాయశ్చిత్తం కోసం ఓరుగల్లు ప్రజల తరుపున, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాజన్న భక్తుల తరుపున, కోట్లాది హిందువుల పక్షాన కేటీఆర్ సూచనలతో వేములవాడలో శాంతి హోమం నిర్వహించినట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు.
రాజు తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా ఆ ప్రభావం రాజ్యం మీద, ప్రజల మీద కూడా ఉంటుంది. కాబట్టి, ఆ ప్రభావం నుండి రక్షించుకోవడమే మా ఉద్దేశ్యం అని రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓరుగల్లు ఒక గొప్ప శైవ క్షేత్రం. అడుగడుగునా శివాలయాలలో విలసిల్లుతున్న గడ్డ, సుమారు 400 ఏళ్లపాటు ఓరుగల్లు రాజధాని కేంద్రంగా పాలన చేసిన కాకతీయులు గొప్ప శివ భక్తులు. అలాంటి, ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తూ, ప్రజా విశ్వాసాలకు విరుద్ధంగా స్వయంగా తన సిఫారసుతో రాజన్న కోడెలను కోతకు పంపి ప్రజల నమ్మకాలను, మనోభావాలను హత్య చేసింది మంత్రి కొండా సురేఖ. కాబట్టి, అంతటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా, ఓరుగల్లు బిడ్డగా, శివ భక్తుడిగా ఆ పరమ శివుడికి శాంతి కలిగించడం కోసం శాంతి హోమం నిర్వహించి, కోడెను చెల్లించడం జరిగిందని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Dasoju Sravan | లగచర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి.. దాసోజు శ్రవణ్ డిమాండ్
MLC Kavitha | మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత