హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన.. పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, సోమవారం నాటి హుజూరాబాద్ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. దళితబంధు ప్రారంభ సమావేశంలోనే ఈ సన్నివేశం చోటుచేసుకోనున్నది.
ఇదిలా ఉండగా, హుజూరాబాద్ సభకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. గురువారమే సభా ప్రాంగణాన్ని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరిశీలించారు. వేదిక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా జర్మన్ టెక్నాలజీతో సిద్ధం చేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఈ రోజు ప్రగతి భవన్ లో TRS పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపి, ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.@KTRTRS @trsharish @RaoKavitha pic.twitter.com/JR29xp4p6m
— Gellu Srinivas Yadav (@GelluSrinuTRS) August 13, 2021