నేను గత రెండేండ్ల కిందట ఒక నాలుగు లక్షల రూపాయాలు పెట్టుకుని లక్ష్మీనరసింహ హాస్పిటల్ హన్మకొండలో జాయిన్ అయ్యి ఆరోగ్యం బాగు చేసుకున్నా. ఆ బిల్లులు పట్టుకుని ఈటల రాజేందర్ వద్దకు వెళ్తే కనీసం సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా ఇప్పియ్యలే. డబుల్ బెడ్రూం కూడా మంజూరు చేయ్యలేదు. మూడుసార్లు ఆయన ఇంటికెళ్తే కూడా పలుకరించలేదు. ఒక మంత్రిగా ఉండి నన్ను ఆదుకోలేదు. కనీసం ఆర్థిక సహాయం కూడా చేయలేదు. ఓటేయ్యమంటే ఎట్లేస్తా. మేం టీఆర్ఎస్కే ఓటేస్తాం. పక్కా కారు గుర్తుకే ఓటేస్తాం. సీసీ రోడ్లు, కరెంట్ సమస్య లేకుండా ఉండటానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం. ప్రజలకు ఎలాంటి హానీ కలగకుండా కేసీఆర్ చూసుకుంటున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు కరెంట్ కొరతకు కేసుల మీద కేసులు అయినాయి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. కెనాల్‌కు నీళ్లు వస్తున్నాయి. రెండు పంటలు పండుతున్నాయి. నాకు ఈటల రాజేందర్‌కు ఎలాంటి సహాయం చేయలేదు. –రామ్ ప్రభాకర్ ( ఇల్లంతకుంట మండలం, టేకుర్తి గ్రామం )
అరే గొర్రెలు వచ్చినాయి.. భూమి పైసలు పడుతున్నాయి. అందుకే కేసీఆర్‌కు ఓటేయాలనుకుంటున్నాను. జనాలంత ఇదే మాట అనుకుంటున్నారు. కేసీఆర్‌కే ఓటేయాలి.. ఈటల రాజేందర్ ఈడ గెలుస్తడు.. మళ్లీ అడికి వోతడు. మనకు ఏం పనులు చేస్తడు అని జనాలు అనుకుంటుర్రు. – రైతు బోయిని సంపత్ ( హుజూరాబాద్ మండలం, కంకులగిద్ద గ్రామం )