గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సరిపోయినంతా నీరు అందిస్తున్నారు. గతంలో సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నాం. కేసీఆర్ హయాంలో కరెంట్, సాగునీటి కష్టాలు లేవు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సహాయం రూ. 10 వేలు ఇవ్వడం శుభపరిణామం. రైతు చనిపోతే బీమా అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ఆసరా పెన్షన్లు ఇస్తూ వృద్ధులను ఆదుకుంటున్నారు. కల్యాణలక్ష్మితో నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారు. ఈటల రాజేందర్ రైతులకు చేసిందేమీ లేదు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. రైతన్నలందరూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. -నాగినేని కొండలరావు ( జమ్మికుంట మండలం, జగ్గయ్యపల్లి గ్రామం )
గౌడ కులస్తులం. జీవనోపాధి కోసం తాళ్లు ఎక్కుతున్నాం. తమ గ్రామంలో ఉన్న గుడి రోజురోజుకు రోడ్డుకు దిగువకు అయిపోతోంది. ఎవరు పట్టించుకోలేదు. దీంతో నాలుగైదు వందల మంది కలిసి హరీశ్‌రావు దగ్గరకు వెళ్లాం. హరీశ్‌రావు స్పందించి గుడి కట్టిస్తానని చెప్పిండు. కులవృత్తి పరంగా కూడా హరీశ్‌రావు ఆదుకుంటానని చెప్పిండు. పక్కా హామీ ఇస్తున్నాం. టీఆర్ఎస్ ను గెలిపించుకుంటాం. మమ్మల్ని ఈటల రాజేందర్ ఏనాడూ పట్టించుకోలేదు. – రంగు రమేశ్ గౌడ్ ( జమ్మికుంట మండలం, జగ్గయ్యపల్లి గ్రామం )