గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 19:28:39

రెండో పెళ్లికి సిద్ధ‌మైన భ‌ర్త‌.. భార్య ధ‌ర్నా

రెండో పెళ్లికి సిద్ధ‌మైన భ‌ర్త‌.. భార్య ధ‌ర్నా

నాగర్‌కర్నూల్ : త‌న‌ని కాద‌ని రెండో పెండ్లికి సిద్ధ‌మైన భ‌ర్త ఇంటి ముందు భార్య ధ‌ర్నాకు దిగింది. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్‌లో చోటుచేసుకుంది. నాగ‌ర్‌క‌ర్నూల్‌కు చెందిన కాళ్ల శివుడు, రేష్మ ఇరువురు ప్రేమికులు. రెండేళ్ల‌క్రితం పెండ్లి చేసుకున్నారు. కాగా క‌ట్నం డ‌బ్బుల కోసం ఆశ‌ప‌డి శివుడు మ‌రో పెండ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ నెల 30నే వివాహం. ఇది తెలిసిన భార్య రేష్మ విష‌యాన్ని వివ‌రిస్తూ ఫ్లెక్సి క‌ట్టి భ‌ర్త ఇంటి ముందు ధ‌ర్నాకు దిగింది. త‌న‌కు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటుంది.