నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా..!
KP Sharma Oli: ఖాట్మండు: నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్ కార్యదర్శి గోపాల్‌నాథ్ యోగి తెలిపారు.

ఖాట్మండు: నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్ కార్యదర్శి గోపాల్‌నాథ్ యోగి తెలిపారు. కరోనా సోకిన ఈ 26 మందిలో నలుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో ఇవాళ పార్లమెంట్లో జరుగాల్సిన ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాసపరీక్షపై ఉత్కంఠ నెలకొన్నది.
ఓలి విశ్వాసపరీక్ష నెగ్గేనా..!
ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్లమెంట్లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్-యుఎంఎల్‌కు ప్రస్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

