హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 34,952 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కాకతీయ కెనాల్ ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం1083.80 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 55.97 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..