Harish Rao | తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టాడు.కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయండి.. తెలంగాణ నోటికాడ ముక్క లాక్కొండని ప్రతిపాదించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు హరీశ్ రావు.
జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాలుంటాయి. కేంద్రప్రభుత్వం చైర్మన్‌గా ఉంటే.. ఓవైపు తెలంగాణ ఇంజనీర్లు, మరోవైపు ఏపీ ఇంజనీర్లు ఉంటారు.. జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారవుతుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవేళ తెలంగాణ ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోలేదా..? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కడిది. ఇది ఎజెండాలో పెట్టే జీఆర్ఎంబీకి ఎక్కడిది..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు. త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలను మేం అనుమతులు తెచ్చినమన్నారు. తెచ్చిన అనుమతులు రద్దయితయా..? అని హరీశ్ రావు అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేదు.. ఒక్క టీఎంసీకి కూడా మీకు క్లియరెన్స్‌లు తేలేదు. మీరొచ్చిన తర్వాత డీపీఆర్‌లు రిటర్న్ వచ్చినయి. సమ్మక్క బ్యారేజ్, పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ రిటర్న్ వచ్చింది. వార్దా డీపీఆర్ రిటర్న్ వచ్చింది ఒక్కో ప్రాజెక్టు వాపసు వస్తున్నాయి. పైగా బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు రద్దు చేయాలనే ఎజెండా వచ్చింది. ఎంత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇదని హరీశ్ రావు మండిపడ్డారు.
తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిది
కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టాడు
కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయండి.. తెలంగాణ నోటికాడ… pic.twitter.com/P7UziyQqGf
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026