రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల
తెలంగాణ శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
- మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాలకు డీనోవో పద్ధతిలో ఓటర్ల జాబితా
- నమోదు గడువు నవంబర్ 6
- డిసెంబర్ 30న తుది జాబితా
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుత సభ్యుల పదవీకాలం మార్చి 2027లో ముగియనున్నందున ఎన్నికల ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించి డీనోవో పద్ధతిలో నూతన ఓటర్ల జాబితాలను రూపొందించాలని ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈసారి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃసిద్ధం (డీనోవో) చేయనున్నందున, ప్రస్తుత జాబితాలో పేరున్న వ్యక్తులు కూడా తాజాగా సవరించిన ఫారమ్-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అవసరమైన పత్రాలు/సర్టిఫికెట్లను జతచేసి ఫారమ్-18ను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నియమిత అధికారులు, అదనపు నియమిత అధికారులకు వ్యక్తిగతంగా సమర్పించవచ్చని, దరఖాస్తులను పోస్టు ద్వారా కూడా పంపవచ్చని సూచించారు. ‘నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల దాఖలుకు అవకాశం, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు’ అని సీఈవో వివరించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

