MedaK Rains | రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతమవుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన కుండపోత వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతూ వరద నీరు రోడ్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేశాయి.
ఇప్పటికే మెదక్ జిల్లాలోని పలు మార్గాల్లో వరదలు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
మెదక్‌తోపాటు హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపిన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెదక్ జిల్లావ్యాప్తంగా రేపు (శుక్రవారం) ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు మెదక్ డీఈవో రాధాకిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సెలవు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త