Hyderabad Rains : హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రెండు గంటలపాటు కుండపోతగా వాన పడడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పారడైజ్ సమీపంలోని ప్యాట్యీ కాలనీ (Patny Colony), పైగా (Paigah) కాలనీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వర్ష బీభత్సానికి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు వంటివి తడిసిపోయాయి.
ప్యాట్నీ కాలనీలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయనేవిషయం తెలుసుకున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) వెంటనే అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపి.. పడవల సాయంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలకు చేపట్టారు. రెస్క్కూ పనుల్ని రంగనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Hyderabad rains flood low-lying areas; #Patny nala overflows, inundating #colonies. @Comm_HYDRAA Commissioner AV Ranganath oversees rescue ops by boat. #DRF teams evacuate trapped residents. #Floodwater also enters #BathukammaKunta in #Amberpet.… pic.twitter.com/LQ2j5VlSvd
— NewsMeter (@NewsMeter_In) July 18, 2025
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మొదలైన వాన నగరమంతా విస్తరించింది. రెండు గంటల పాటు బ్రేక్ లేకుండా పడిన వర్షంతో పలు చోట్ల ఫ్లై ఓవర్లపై కూడా భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దాంతో, ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. రాత్రి కూడా హైదరాబాద్లో వర్ష సూచన ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాదు వర్షం ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ సూచించింది.