రామవరం, జూలై 18 : వర్షాకాలం ప్రారంభం అయింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని రుద్రంపూర్ పంచాయతీ అధికారి, సిబ్బంది దోమలపై యుద్ధాన్ని ప్రకటించారు. పంచాయతి సెక్రటరీ నరేందర్ ప్రత్యేక చొరవ చూపి పంచాయతీ పరిధిలోని ప్రతి ఏరియాలో ఫాగింగ్ చేసేలా ఆదేశించారు. దీంతో ఇకనుండి వారంలో ఒకసారి ఫాగింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే మురుగు కాల్వల్లో నీరు నిల్వ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పిచ్చి చెట్లు దోమలకు ఆవాసాలుగా మారుతున్న తరుణంలో పిచ్చి మొక్కల తొలగింపును చేపట్టారు. ఫాగింగ్ కార్యక్రమాన్ని పంచాయతీ గుమస్తా సలీం, రాజేశ్ పర్యవేక్షిస్తున్నారు.