Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాన పడడం ఖాయం అని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది కూడా. ఆ సంస్థ చెప్పినట్టే గురువారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలో ఉరుములతో, మెరుపులతో కూడిన వాన మొదలైంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, బోరబండ, తిరుమలగిరి, బోయిన్పల్లి, నారాయణగూడ, చంపాపేట, చాదర్ఘాట్లో జోరుగా వాన కురుస్తోంది. వాన నీరు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. పలు చోట్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Rain Started In Vijaynagar Colony Hyderabad @Hyderabadrains pic.twitter.com/N0Ini57bm7
— Rafi Reporter (@Mohamme37483974) June 12, 2025
శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది.
HEAVY RAIN ALERT!!💥⚡ for Many Parts of the #Hyderabad City During the 9:30-12AM
Huge Stroms Just Parked Close to Chotuppal~PeddaAmberpet Surroundings moving into Hyderabad
Rains will First hit East #Hyderabad Followed by other Parts of the City
STAY ALERT⚠️#HyderabadRains pic.twitter.com/ygx5n4vJG6
— Hyderabad Rains (@Hyderabadrains) June 12, 2025