WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మొదటి రోజు నుంచి సెషన్ సెషన్‌కు ఆధిపత్యం మారతూ వస్తున్న మ్యాచ్‌లో టీ సెషన్ తర్వాత దక్షిణాఫ్రికా (South Africa) పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 138 ఆలౌటైన సఫారీ టీమ్.. అనంతరం బౌలర్ల విజృంభణతో ఆసీస్‌ను ఆలౌట్ అంచున నిలిపింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్ మీద కగిసో రబడ(2-15), లుంగి ఎంగిడి(3-35)లు కంగారూ బ్యాటర్లకు దడ పుట్టించగా కమిన్స్ సేన 73కే ఏడు వికెట్లు కోల్పోయి.. మ్యాచ్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ ప్రమాదంలో పడింది. దక్షిణాఫ్రికాను 138 కే కట్టడి చేసిన ఆసీస్ భారీ స్కోర్‌తో విజయంపై గురి పెట్టింది. అయితే.. సఫారీ పేసర్ కగిసో రబడ(2-15) ప్రత్యర్థిని ఆదిలోనే దెబ్బకొట్టాడు. డేంజరస్ ఉస్మాన్ ఖవాజా(6), కామెరూన్ గ్రీన్(0)లను ఔట్ చేసి కంగారూలకు షాకిచ్చాడు. ఆ తర్వాత లుంగి ఎంగిడి(3-35) తన మ్యాజిక్ చూపిస్తూ స్టీవ్ స్మిత్(13)ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
Test cricket. Nothing matches it. pic.twitter.com/eiSK5yEPMK
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2025
అంతే.. ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. కాసేపటికే మల్డర్ సూపర్ బాల్‌తో ట్రావిస్ హెడ్()ను బౌల్డ్ చేయగా..64కే ఐదో వికెట్ పడింది. వరుసగా వికెట్లు పడుతున్న జట్టును ఆదుకుంటాడనుకున్న కమిన్స్(6)ను ఎంగిడి బౌల్డ్ చేసి వాళ్ల కష్టాలను మరింత పెంచాడు. ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరిన వేళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(14) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆధిక్యం 165 ఉంది. టెయిలెండర్లతో కలిసి జట్టు ఆధిక్యాన్ని 200కు పెంచే ప్రయత్నంలో ఉన్నాడు.
RABADA repeat what he did in first innings 🙌🙌🙌🙌
Removed #UsmanKhawaja and #CameronGreen in quick succession! 🙌🙌#WTCFinal #TestCricket #Final #AUSvsSA #AUSvSA #ICC #WTC25 #WTC2O25Finalpic.twitter.com/OH1yY5cogA
— The Sports Feed (@thesports_feed) June 12, 2025