TG Govt | తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించింది. పాత మంత్రులకు కేటాయించిన జిల్లాలను మార్చింది. మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు అప్పగించింది. నల్లగొండకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్‌కు జూపల్లి కృష్ణారావు బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ ఇన్చార్జిగా సీతక్క, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్‌నగర్‌కు దామోదర్ రాజనర్సింహా, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్చార్జిగా పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా ఇన్చార్జిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.