టీఆర్ఎస్లో భారీగా చేరికలు

కాగజ్‌నగర్ రూరల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో 300 మంది భవన నిర్మాణ కార్మికులు టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత సంఘాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ శంకర్, వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, దర్ని రాములు, రాజన్న, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి