Hindu Population: 1950 నుంచి 2015 వరకు దేశంలో తగ్గిన హిందువుల జనాభా..
Hindu Population: భారత్‌లో మెజారిటీగా ఉండే హిందువుల జనాభా తగ్గిపోయింది. 1950 నుంచి 2015 మధ్య కాలంలో ఆ జనాభా 7.81 శాతం పడిపోయింది. మరో వైపు దేశంలోని మైనార్టీల సంఖ్య మాత్రం పెరిగినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: దేశంలో హిందూ జనాభా(Hindu Population) గణనీయంగా తగ్గినట్లు ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పడిపోయినట్లు ఆ స్టడీలో తేల్చారు. భారత్‌లో హిందువుల జనాభా తగ్గుతూ ఉండగా, మరోవైపు బౌద్ద, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా పెరుగుతూ పోయింది. ఇక పార్సీలు, జైనులు జనాభా కూడా తగ్గింది. సమీప మిత్ర దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరుగుతుండగా, భారత్‌లో మాత్రం ఆ జనాభా తగ్గినట్లు రిపోర్టులో తెలిపారు.
1950 సంవత్సరంలో భారత్‌లో హిందువుల జనాభా 84.68 శాతం ఉండగా, 2015 నాటికి ఆ సంఖ్య 78.06 శాతానికి చేరుకున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. మరో వైపు గడిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగిందని స్టడీలో పేర్కొన్నారు. మయన్మార్‌లో హిందువుల జనాభా పది శాతం పడిపోయింది. నేపాల్‌లో కూడా హిందువుల సంఖ్య 3.6 శాతం తగ్గినట్లు తెలిపారు.
భారత్‌లో మైనార్టీలకు రక్షణ పెరిగిందని, వాళ్లు ఇండియాలో సుఖంగా జీవిస్తున్నట్లు స్టడీలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి, మైనార్టీ జనాభా పెరిగినట్లు అంచనా వేశారు. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో ఇండియా ఉన్నట్లు స్టడీలో రచయితలు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

