Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు స్పందించారు. భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతులపై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేసాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నేడు బస్తా యూరియా కోసం పోలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తెచ్చావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తుల్లా కనిపిస్తున్నారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు. నీ చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. రైతులను నేరస్తులుగా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టిన నీ దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదని. తగిన సమయంలో బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు.
భూమి కోసం పోరాడిన లగచర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతులపై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేసావు.
నేడు బస్తా యూరియా కోసం పోలాలు వదిలి పోలీసు స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తెచ్చావు.
దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా?… pic.twitter.com/UlXf50y8w5
— Harish Rao Thanneeru (@BRSHarish) September 13, 2025