Urea Shortage | కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయడం చేతగాక.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవాళ ఉదయం సొసైటీకి వచ్చిన రైతులకు యూరియా సరఫరా చేయలేక.. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది.
యూరియా కోసం బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు శనివారం భారీగా రైతులు తరలివచ్చారు. అయితే బీబీపేట మండలంలో చాలామంది రైతులకు యూరియా అవసరం ఉండగా.. కేవలం 600 బస్తాలు మాత్రమే కేంద్రానికి వచ్చాయి. కానీ అన్నదాతలు మాత్రం భారీగా క్యూకట్టారు. దీంతో ఎవరికీ యూరియా పంపిణీ చేయాలో అర్థంగాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. వారందరికీ సరిపడా యూరియా లేకపోవడంతో వారిని కట్టడి చేయడం కష్టమవుతుందని వ్యవసాయ అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
దరిద్రపు కాంగ్రెస్ పాలనలో
పోలీస్ స్టేషన్ లో ఖైదీల్లా రైతుల దుస్థితి 😰కామారెడ్డి జిల్లా, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి యూరియా టోకెన్ల పంపిణీ చేస్తున్న రేవంత్ సర్కార్ 😡
ఎవని పాలైందిరో తెలంగాణ!#CongressFailedTelangana pic.twitter.com/NkVn6MYtnr
— BRS Party (@BRSparty) September 13, 2025
సొసైటీ వద్దకు వచ్చిన పోలీసులు రైతులను వెంటనే బీబీపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. స్టేషన్ ముందు వారందరినీ నేరస్థుల్లా కూర్చొబెట్టారు. గంటల తరబడి వారిని స్టేషన్ ముందే కూర్చోబెట్టి టోకెన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం గంటల కొద్దీ ఎండలోనే ఎదురుచూస్తూ ఉండటంతో రాజు అనే రైతు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ.. ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంపిణీ చేస్తున్న పోలీసులు
టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయిన రాజు అనే రైతు
చికిత్స నిమిత్తం… https://t.co/dVOWkrtGB5 pic.twitter.com/ksow0EieYz
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2025