హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఇంది నిదర్శనమని చెప్పారు. వీరన్నది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక బతుకులు భారమైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని బాండ్లు రాసిచ్చారని, అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేయడం దుర్మార్గమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం.
వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?
రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి… ఎవరూ అధైర్యపడకండి’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న… pic.twitter.com/sJ7f9pUjUY
— Harish Rao Thanneeru (@BRSHarish) December 1, 2025
అన్నం పెట్టే రైతులం.. కన్నీళ్లు పెడుతున్నం!
Samantha | మళ్లీ పెళ్లి చేసుకున్న సమంత.. కాసేపట్లో అధికారిక ప్రకటన..?