అన్నం పెట్టే రైతులం.. కన్నీళ్లు పెడుతున్నం!.. అందరినీ కలిచివేస్తున్న కౌలు రైతు సెల్ఫీ వీడియో
కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి తలకిందులవుతున్నది.
- కౌలు రైతులను ప్రభుత్వమే పట్టించుకోవాలె
- ఖమ్మం జిల్లా కౌలురైతు మరణ వాంగ్మూలం
- తుఫానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతు
- కౌలు కట్టలేక, అప్పు తీర్చలేక ఆత్మహత్య
- గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నామన్నా!
ఈ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నా! ప్రభుత్వమే ఆదుకోవాలన్నా!
రైతుల కష్టాన్ని గుర్తించి, పంటలకు సరైన రేట్లు ఇవ్వాలన్నా. వారిని ఆదుకోవాలె. కౌలు రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాలన్నా. భూమిని కౌలుకు ఇచ్చిన రైతులు కూడా.. కౌలు కట్టలేని రైతులను ఆదుకోవాలన్నా. వాళ్లను అర్థం చేసుకోవాలె!’ అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న ఆవేదన వ్యక్తంచేశాడు. పురుగులమందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 30: కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి తలకిందులవుతున్నది. కష్టకాలంలో ఆపన్న హస్తం అందించేవాళ్లు కనిపించక అధైర్యపడి జీవితాలను ముగిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమం గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్య ఉదంతం సభ్యసమాజం ముందు చాలా ప్రశ్నలను పెట్టంది. చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో.. కంట తడి పెట్టిస్తున్నది.
సంక్షోభంలో చిక్కుకున్న రైతును ఆదుకోవాల్సిన బాధ్యత.. ప్రతీ ఒక్కరిపై ఉందంటూ అతనొక వేడుకోలుతో వాంగ్మూలం ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు చెందిన బానోత్ వీరన్న (40) సొంత వ్యవసాయ భూమిలేని పేద గిరిజన కౌలు రైతు. పొరుగునే ఉన్న కూసుమంచి మండలం మునిగేపల్లిలో ఓ రైతు వద్ద ఐదున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని వరి, పత్తి వేశాడు. నేలకొండపల్లి మండలంలోని మోటాపురంలో మరో రైతు వద్ద నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, చెరుకు వేశాడు. అదే గ్రామంలోని మరో రైతు వద్ద ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశాడు. భూముల కౌలుతోపాటు పంటల పెట్టుబడికి కలిపి రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు.
ఇటీవల తుపానుల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని పంటలు కాస్త చేతికొచ్చినా వాటికి సరైన ధర పలుకలేదు. పదిన్నర ఎకరాలు కౌలుకు తీసుకొని రేయింబవళ్లూ చెమటోడ్చి నాలుగు రకాల పంటలు సాగుచేసినా ఒక్క పంట కూడా చేతికి రాకుండాపోయింది. తుపాన్లు, అధిక వర్షాలు, వరదలతో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి.
మనస్తాపం..బలవన్మరణం
వీరన్న పెట్టిన పెట్టుబడికి వచ్చిన దిగుబడి పొంతనే లేకుండాపోయింది. దీంతో కౌలు రైతు వీరన్న గుండె చెరువైంది. సాగు కోసం చేసిన రూ.15 లక్షల అప్పులతో ఆవేదన చెందాడు. శనివారం కౌలుకు చేస్తున్న పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగాడు. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వ్యవసాయంలో తన కష్టనష్టాలను, తోటి రైతుల బాధలను, ప్రభుత్వాల బాధ్యతలను ఆ సెల్ఫీ వీడియోలో వివరించాడు. వీరన్నను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. వీరన్న చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. నేలకొండపల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. వీరన్నకు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న… pic.twitter.com/sJ7f9pUjUY
— Harish Rao Thanneeru (@BRSHarish) December 1, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

