Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహం చేసుకున్నట్లు సినీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్ (Isha Yoga Centre)లో గల లింగ భైరవి ఆలయం (Ling Bhairavi Temple)లో వివాహ బంధంతో ఒక్కటైనట్లు తెలిపాయి. అయితే, పెళ్లి విషయంపై సమంత – రాజ్ జంట ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే, ఇవాళ సాయంత్రం వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి తమ పెళ్లి గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత (Samantha) రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక నెట్టింట ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరిద్దరూ అతి తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌మీడియా మొత్తం కోడైకూసింది.
పలు కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్తుండటంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్‌లో భాగంగా రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్‌గా చేయగా, అందులో ఆయనకి కాస్త క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించింది. అంతేకాదు వెకేషన్స్, పలు ఈవెంట్స్‌లో వీరిద్దరూ చాలా క్లోజ్‌గా దర్శనమిచ్చారు. దీంతో డేటింగ్ వార్తలు నిజమేనంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ రూమర్స్ వేళ ఇవాళ వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైనట్లుగా ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే సాయంత్రందాకా వేచి చూడాల్సిందే.
Also Read..
Ashika Ranganath | టాలీవుడ్ నటి ఆషికా రంగనాథ్ ఇంట్లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న మేనమామ కూతురు
Akhanda 2 | డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన అఖండ 2: తాండవం .. జ్యూక్బాక్స్తో హైప్ రెట్టింపు
Shivaji Raja | అరుణాచలంలో సెల్ఫీలు, వ్లాగ్‌లు.. వాళ్లే అంతా నాశనం చేస్తున్నారంటూ శివాజీ రాజా ఫైర్