Akhanda 2 | డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2- తాండవం చిత్రంపై ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి పార్ట్ ఘన విజయంతో రెండో భాగంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, మూవీ టీమ్ అర్ధరాత్రి సడెన్‌గా ఫుల్ జ్యూక్‌బాక్స్‌ను రిలీజ్ చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. మొత్తం 9 పవర్ఫుల్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో చేర్చారు.
విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాటలు ట్రెండ్ అవుతూ, కామెంట్లతో అభిమానులు ముంచెత్తుతున్నారు. తొలి భాగంలా ఈ సారి కూడా మ్యూజిక్ ఆల్బమ్ భక్తిరసంతో పాటు మాస్ వైబ్స్‌ను పంచుతూ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తోందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
అఖండ 2 జ్యూక్‌బాక్స్ – పాటల జాబితా
1. అఖండ తాండవం
సింగర్: సర్వేపల్లి సిస్టర్స్
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
2. గంగాధర శంకరా
సింగర్: ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య, సృతి రంజని
సాహిత్యం: అద్వితీయ వోజ్జల
3. శివ శివ
సింగర్: గొట్టె కనకవ్వ, సృతి రంజని
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
4. హర హర
సింగర్: ఎస్.పీ. చరణ్, శ్రీకృష్ణ
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
5. శంకర శంకర
సింగర్: వి. ఎం. మహాలింగం, దివ్య కుమార్, దీపక్ బ్లూ, అరుణ్ కౌండిన్య
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి
జ్యూక్బాక్స్లోని పాటలు భక్తిరసం, ఆధ్యాత్మిక ఎనర్జీ, మాస్ పంచ్‌లు అన్నీ కలగలసినట్టు ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. మొదటి భాగం సంగీతానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యూక్‌బాక్స్ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగింది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చే ప్రతి చిత్రంకి ప్రత్యేక స్థానం ఉండగా, అఖండ 2 కూడా అదే స్థాయి సంచలన విజయాన్ని సాధించగలదా? అన్నదే ఇప్పుడు అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. ఈ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ విజయం సాధించాయి. డిసెంబర్ 5న థియేటర్లలోసందడి చేయనున్న అఖండ2 మళ్లీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.