జగిత్యాల : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. అధికార కాంక్షతో అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బిజీగా ఉంది. కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని దివ్యాంగులు(Handicapped protest )సైతం ధర్నాకు దిగారు.
రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల(Jagityala) కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఒకరి తోడు లేకుండా జీవనం గడిపే తమకు ప్రభుత్వం పెన్షన్ పెంచి ఆదుకోవాలన్నారు. చాలీచాలని పెన్షన్‌తో అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగుల నిరసన
రూ. 6000 పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకి దిగిన దివ్యాంగులు. pic.twitter.com/eeUNHXujC3
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2024