Group-4 | హైదరాబాద్ : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ ప్రభుత్వ దవాఖానలో మెడికల్ బోర్డు.. ఆటిజం, మానసిక రుగ్మత, మందబుద్ధి ఉన్న అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఆయా అభ్యర్థులు హాల్‌టికెట్, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాత మెడికల్ సర్టిఫికెట్‌తోపాటు కుటుంబసభ్యుడిని వెంట తీసుకురావాలని ఆదేశించారు. రోజువారీ మెడికల్ బోర్డు షెడ్యూల్‌ను కమిషన్ వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొన్నారు.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్) గ్రేడ్-2 పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ నెల 31న విడుదల చేయనున్నట్టు కార్యదర్శి నవీన్‌నికోలస్ తెలిపారు. కీపై అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు కమిషన్ వెబ్సైట్లో పెట్టే లింక్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద..
Harish Rao | కరెంట్ కోతలపై శాసనసభలో భట్టికి హరీశ్‌రావు సవాల్.. తోక ముడిచిన రేవంత్ సర్కార్
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి.. కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో : హరీశ్‌రావు
Harish Rao | బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు..! : హరీశ్‌రావు