Group-3 | హైదరాబాద్ : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి మొత్తంగా 50 శాతం మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్1 పరీక్షకు 51.1 శాతం, పేపర్ 2 పరీక్షకు 50.7శాతం హాజరు కాగా, సోమవారం నిర్వహించిన పేపర్ 3కి 50.24 శాతం మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 71.30 శాతం మంది హాజరు కాగా, అత్యల్పంగా వరంగల్ జిల్లాలో 49.93 శాతం మంది హాజరయ్యారు. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ.. నిప్పులు చెరిగిన ఎంపీ డీకే అరుణ
KTR | ప్రశ్నిస్తే సంకెళ్లు..! నిలదీస్తే అరెస్టులు..!! కొణతం దిలీప్ అరెస్టుపై మండిపడ్డ కేటీఆర్