యాదాద్రి భువనగిరి : నేడు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ఆలేరు మండలంలోని కొలనుపాక(Kolanupaka,) జైన దేవాలయంతోపాటు సోమేశ్వరాలయం సందర్శించనున్న గవర్నర్, మధ్యాహ్నం మూడు గంటలకు భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణ గిరి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఐదు గంటలకు ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో సమావేశంలో పాల్గొంటారు. ఇందుఎకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read..