Gujarat Rains | గుజరాత్లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. నాలుగు రోజుల్లో 28 మంది మృతి
Gujarat Rains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది.
Gujarat Rains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఐదో రోజైన గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
మోర్బి, వడోదర, బరూచ్, జామ్‌నగర్, ఆరావలి, పంచమహల్, ద్వారకా, డాంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు మరణించారు. గాంధీనగర్, ఖేడా, మహిసాగర్, దహోద్, సురేంద్రనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 18 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వరద పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎంని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ సహా వరద ప్రభావిత జిల్లాల్లో భారత వైమానిక దళం, భారత తీరగస్తీ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Also Read..
MLC Kavitha | 160 రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత తొలి ట్వీట్.. సత్యమేవ జయతే అంటూ పోస్ట్
Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Rain in Delhi | ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. మునిగిన అండర్‌పాస్‌లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

