ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 11:02:29

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్‌

 రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌: వికారాబాద్‌ రోడ్డు ప్రమాద మృతుల బంధువులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శనివారం ఉదయం మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను లారీ, ఆర్టీసీ బస్సు ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు. 

మండలంలోని శంకర్‌పల్లి వద్ద పత్తి తీసేందుకు చిట్టంపల్లి నుంచి ఆటోలో వెళ్తున్నారు. అయితే మరికొంత మంది కూలీల కోసం ఇజ్రా చిట్టంపల్లి గేట్ వద్ద ఆటో ఆగింది. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి తాండూరు వైపు లారీ వెళ్తుండగా, తాండూరు నుంచి సంగారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వస్తూ.. ఆగి ఉన్న ఆటోను ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొన్న లారీ బోల్తా పడింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 


logo