సర్వర్ అప్‌గ్రేడేషన్.. రేపట్నుంచి ప్రభుత్వ వెబ్సైట్లు బంద్
సర్వర్ అప్‌గ్రేడేషన్| రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూపీఎస్ అప్‌గ్రేడేషన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూపీఎస్ అప్‌గ్రేడేషన్ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్లు, ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిని గచ్చిబౌలిలోని టీఎస్ఐఐసీ సెంటర్లో ఉన్న స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ) నిర్వహిస్తున్నది. ఎస్‌డీసీలో 2011 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దానిలోని యూపీఎస్ (సర్వర్లు)లు పాతవి కావడంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అవి పనిచేయడం లేదు. ఈ కేంద్రంలో ఉన్న పవర్ బ్యాకప్ వ్యవస్థ సరిపోవడం లేదు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పుడల్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్‌డీసీలోని యూపీఎస్‌లను మార్చాలని, ఇతర వ్యవస్థలను ఆధునికీకరించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి రెండ్రోజులు మరమ్మతులు చేయనున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వెబ్సైట్లు, ఎస్డీసీకి అనుబంధంగా ఉన్న ఇతర ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మ్యూజియంగా మారనున్న దిలీప్ కుమార్ పూర్వీకుల ఇల్లు..!
బయటపడిన మరో భారీ డైమండ్.. ఎంత పెద్దదో తెలుసా?
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
ఆరోగ్యశాఖమంత్రిగా మన్సుక్ మాండవీయ.. ఇదీ ఆయన ప్రొఫైల్
బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కొవిడ్ మరణాలు : డబ్ల్యూహెచ్‌వో
కొత్తగా 45,892 కరోనా పాజిటివ్ కేసులు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

