యూరో కప్ 2020: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
యూరో కప్| యాభై ఐదేండ్ల నిరీక్షణకు తెరపడింది. 1966 తర్వాత మొదటిసారిగా ఇంగ్లండ్ ఓ మేజర్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. వచ్చే ఆదివారం జరగనున్న యూరో 2020 ఫైనల్లో ఇటలీతో తలపడనుంది. డెన్మార్క్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2-1తో చారిత్రక విజయం సాధించింది.

లండన్: యాభై ఐదేండ్ల నిరీక్షణకు తెరపడింది. 1966 తర్వాత మొదటిసారిగా ఇంగ్లండ్ ఓ మేజర్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. వచ్చే ఆదివారం జరగనున్న యూరో 2020 ఫైనల్లో ఇటలీతో తలపడనుంది. డెన్మార్క్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2-1తో చారిత్రక విజయం సాధించింది. ఆట ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత మొదటి గోల్ నమోదయింది. డెన్మార్క్ ఆటగాడు మైకెల్ డామ్స్‌గార్డ్ తన జట్టుకు గోల్ సాధించిపెట్టాడు. దీంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆట హోరాహోరీగా సాగుతున్న క్రమంలో డెన్మార్క్ ప్లేయర్ సైమన్ జైర్ చేసిన పొరపాటుకు ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకున్నది. మ్యాచ్ 90వ నిమిషంలో సైమన్.. సెల్ఫ్‌గోల్ చేయడంతో ఇంగ్లండ్ ఖాతా తెరిచినట్లయింది. దీంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యింది.
సమయం ముగిసినప్పటికీ ఫలితం తేలకపోవడంతో నిర్వాహకులు అదనపు సమయం కేటాయించారు. దీంతో 14వ నిమిషం వద్ద ఇంగ్లండ్ ఆటగాడు హెర్రీ కేన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచిన హెర్రీ.. తన జట్టుకు మరపురాని విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 56 ఏండ్ల కళ ఫలించినట్లయింది. మొదటిసారిగా ఓ ప్రముఖ టోర్నీలో ఫైనల్లో తలపడనుంది. వచ్చే ఆదివారం వెంబ్లే స్టేడియంలో ఇటలీతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇవి కూడా చదవండి..
యూరో కప్: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
మోదీ క్యాబినెట్ విస్తరణ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్?!
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ఎవరెవరికి ఏ శాఖ.. ఇవీ డిటైల్స్..!!
హైదరాబాద్ టు లండన్ టేకాఫ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

