బయటపడిన మరో భారీ డైమండ్.. ఎంత పెద్దదో తెలుసా?

గబరోన్: అత్యంత విలువైన రాళ్లలో డైమండ్ ఒకటి. అలాంటి డైమండ్లు బయటపడటమే అరుదంటే.. వాటిలో పెద్ద సైజువి దొరకడం అత్యంత అరుదు. కానీ బోట్సువానాలో మాత్రం నెల రోజుల వ్యవధిలో అలాంటివి రెండు వజ్రాలు దొరికాయి. తాజాగా జూన్ 12న 1174 క్యారెట్ల భారీ డైమండ్ బయటపడింది. అంటే మన అరచేతిలో పట్టేంత పెద్దది ఇది. కెనడాకు చెందిన మైనింగ్ సంస్థ లుకారాకు ఇది దొరికింది. ఆ డైమండ్‌ను బుధవారం బోట్సువానా కేబినెట్‌కు ఆ సంస్థ అందించింది. ఇది తమ కంపెనీతోపాటు బోట్సువానా చరిత్రను కూడా తిరగరాసే సందర్భమని కంపెనీ ఎండీ నసీమ్ లాహ్రి అన్నారు.
ప్రపంచంలో మూడో స్థానం
ఈ డైమండ్‌ది ఇప్పటి వరకూ దొరికిన భారీ వజ్రాల్లో మూడోస్థానమని కంపెనీ వెల్లడించింది. అంతకు కొన్ని రోజుల ముందే అంటే జూన్ 1న ఇదే బోట్సువానాలో స్థానిక డైమండ్ సంస్థ డేబ్స్వానా తమకు 1098 క్యారెట్ల వజ్రం దొరికినట్లు ప్రకటించింది. అప్పటికి ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద డైమండ్ అని ఆ సంస్థ ప్రకటించగా.. ఈ తాజా 1174 క్యారెట్ల వజ్రం ఆ రికార్డును తిరగరాసింది.
ప్రపంచంలోని పది అతిపెద్ద డైమండ్లలో ఆరు ఈ బోట్సువానాలోనే బయటపడటం విశేషం. ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ 1905లో బయటపడింది. 3106 క్యారెట్ల ఈ వజ్రం సౌతాఫ్రికాలో లభించింది. ఈ డైమండ్లోని భాగాలే బ్రిటిష్ కిరీటంలో ఉన్నాయి. డైమండ్లకు ఆఫ్రికా ఖండం కేరాఫ్ అడ్రెస్ కాగా.. అందులోనూ బోట్సువానాలోనే ఎక్కువగా డైమండ్లు బయటపడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

