భద్రాచలం : ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)వద్ద గోదావరి(Godavari) నీటి ప్రవాహం(Heavy flood) క్రమక్రమంగా పెరుగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 42.2 అడుగులుగా ఉంది. రానున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
కాగా, భారీ వర్షాల(Heavy rains) నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
Also Read..
Nitin Gadkari: స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే.. శివాజీ విగ్రహం కూలేది కాదు: నితిన్ గడ్కరీ
HYDRAA | హైడ్రా పేరుతొ డబ్బుల వసూళ్లకు పాల్పడితే జైలుకే : ఏవీ రంగనాథ్