మహబూబాబాద్ రూరల్ : ఆడపిల్ల పుడితే కుటుంబంతో అసంతృప్తిగా ఉండే ఈ రోజుల్లో అదే ఆడబిడ్డ బారసాలను అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. కృష్ణా కాలనీలో నివాసం ఉండే ప్రశాంత్, వర్ష దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఇంటికి మహాలక్ష్మి, సరస్వతీ దేవి వచ్చిందని భావించి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా వినూత్న రీతిలో పాప బారసాల నిర్వహించారు. రబ్బరు బెలూన్లు, తోరణాలతో ఇంటిని అలంకరించారు. రూ. ఐదు నాణేలతో (లక్ష రూపాయాలు)ను వన్ వచ్చేలా అలంకరించి అందులో పాపను ఉంచి కుటుంబసభ్యులు సంబరంగా బారసాల నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
JEE Mains 2025 | జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షలు ఎప్పటి నుంచంటే..?
Junior Lecturers | జూనియర్ లెక్చరర్ల ప్రొవిజనల్ జాబితా విడుదల
ERC | విద్యుత్ చార్జీల పెoపు ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ