ERC | హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ఈఆర్సీ కమిషన్ చైర్మన్ శ్రీరంగరావు స్పష్టం చేశారు. రూ. 1800కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా, ఆయా ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. దీంతో విద్యుత్తు ఛార్జీల పెంపునకు బ్రేక్‌పడింది.
సోమవారం ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు బండారు కృష్ణయ్య, మనోహర్రాజులు ఈఆర్సీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. డిస్కంలు ప్రతిపాదించిన ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించామని, ఛార్జీల్లో ఎలాంటి మార్పులుండవని ప్రకటించారు. అయితే కొన్ని కేటగిరిల్లో మార్పులతో 0.47శాతం టారిఫ్ రేట్లు పెరిగాయని వారు వివరించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వారిపై భారం పడదని వివరించారు. అయితే కొన్ని కేటగిరి వినియోగదారుల ఫిక్స్డ్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Weather report | రాష్ట్రంలో బలహీన పడిన ఆవర్తనం.. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
KTR | వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం : కేటీఆర్
KTR | బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య : కేటీఆర్