KTR | వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం : కేటీఆర్
KTR | హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీ తో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
KTR | హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీ తో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు కోల్పోయిన వేదశ్రీకి పుస్తకాలతో పాటు బ్యాగులను అందించారు. వారి కుటుంబానికి కూడా కేటీఆర్ ఆర్థికసాయం అందించారు.
హైడ్రా కూల్చివేతల కారణంగా మా పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కేటీఆర్‌కు వేదశ్రీ కుటుంబ సభ్యులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్లలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ పేదల పట్ల రేవంత్ సర్కార్ నిర్దయగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. సడెన్‌గా వచ్చి పేదల ఇండ్లను అప్పటికప్పుడు కూల్చివేయటమనేది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం పేదలన్న మానవత్వం కూడా చూపించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ తరపున న్యాయ సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
హైడ్రా కూల్చివేతలతో ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ ఇంటికి వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
వేదశ్రీ కుటుంబ సభ్యులను కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చి, స్కూల్ బ్యాగ్ కొనిచ్చిన కేటీఆర్.@mkrkkpmla pic.twitter.com/uHs0p8JSLy
— BRS Party (@BRSparty) October 28, 2024
ఇవి కూడా చదవండి..
KTR | బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య : కేటీఆర్
Harish Rao | రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు.. హరీశ్‌రావు చురకలు
Harish Rao | నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hydraa
- KTR
- Kukatpally
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

