Harish Rao | రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు.. హరీశ్‌రావు చురకలు
Harish Rao | బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని హరీశ్‌రావు చురకలంటించారు.
Harish Rao | హైదరాబాద్ : బడికి పోయే పిల్లల నుంచి మొదలుకుంటే పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని హరీశ్‌రావు చురకలంటించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగులు, నిరుద్యోగులను, ఇతర వర్గాలను అందర్నీ మోసం చేసి ఇవాళ ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై నిలదీస్తే.. బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడుతున్నారు. రేవంత్ మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు. విజన్ ఉన్నోళ్లు ఇలా చేయరు. రాష్ట్రాన్ని దివాళా తీయించావు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందంటే.. నీకు పరిపాలన చేయడం చేతకాక, విజన్ లేక, అవగాహన పెంచుకోక ఈ రాష్ట్రం పరువు తీస్తున్నావు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు. రుణమాఫీ మీద నిలదీస్తే వికృతంగా నా గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మూసీ ప్రాజెక్టు విషయంలో నీ అవినీతిని బట్టయబలు చేయడంతో.. దృష్టి మరల్చడానికి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావ్. ఇది షేమ్. రాజకీయంగా కొట్లాడు. నేరుగా కొట్లాడు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి దాడులకు పాల్పడుతున్నాడు. మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టడానికి వ్యతిరేకం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకం అని చెప్పారు. పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కాబట్టి ఆయన మీద బురద జల్లలాలని ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీలయాని కుట్ర చేస్తున్నావు. కానీ అట్టర్ ప్లాఫ్ అయ్యావు. ప్రజలు నీ డ్రామాను అర్థం చేసుకున్నారని హరీశ్‌రావు తెలిపారు.
ఇవాళ రాష్ట్రంలో ప్రతి వర్గం రోడ్డెక్కింది. పురుగుల లేని అన్నంకోసం గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతులు, జీతాల కోసం అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలనీ జీపీ సిబ్బంది, ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ నీ సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు, మా సమస్యలు పరిష్కరించండని పోలీసులు, పెన్షన్ల కోసం వృద్ధులు.. ఇలా అందరూ రోడ్డెక్కుతున్నారు. బడికి పోయే పిల్లల నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు అందర్నీ రోడ్డెక్కించిన పరిస్థితి రేవంత్ రెడ్డిది. పదేండ్ల పాటు అన్ని వర్గాలను కేసీఆర్ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే.. నీ పది నెలల పాలనలో అందర్నీ రోడ్డెక్కించిన చరిత్ర నీది అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు .
ఇవి కూడా చదవండి..
Harish Rao | నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు : హరీశ్‌రావు
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్లను అరెస్టు చేస్తున్న పోలీసులు.. కొనసాగుతున్న నిరసనలు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress govt
- harish rao
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

