Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజాపాలన తొలగిపోయి.. కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్టబయలైందని తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
రాష్ట్రంలో 11 నెలల రేవంత్ రెడ్డి పాలన చూస్తే ప్రజా పాలన కాదు ప్రజా పీడనగా కనబడుతుంది. ప్రజా పాలన తొలిగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్టబయటలైంది. ఏ వర్గానికి తామిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. సీఎం వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా ధర్నాలతో అట్టుడికి పోతోంది.
ధర్నాలు చేస్తున్న వారిని చర్చలకు పిలవొచ్చు కదా..? ఎందుకు చర్చలు జరపడం లేదు. ఎందుకు తిరగబడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు. హామీలు అమలు చేయమంటే నోటికొచ్చినట్టు తిడుతున్నవ్. ఇది సీఎం వైఖరి అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
కొత్త హామీల మాట అటుంచండి.. కేసీఆర్ మానవీయ కోణంలో పేదలు, ప్రజల కోసం తెచ్చిన పథకాను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించలేకపోతున్నారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు. కానీ అది కూడా ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ.. రైతుల కోసం రైతుబంధు అమలు చేసిండు కేసీఆర్. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతుబంధు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క పంటకు కూడా రైతు బంధు లేదు. పదిహేను వేలు కాదు కదా..? ఉన్న పదివేలు కూడా రావడం లేదు. చివరకు పంటలు కొనే దిక్కు లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు జరగడం లేదు. రూ. 7521కు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించారు. కానీ రైతులు రూ. 5500కు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి. మద్దతు ధర రాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉలుకుపలుకు లేదు. దిగాలుగా ఉన్న పత్తి రైతుకు.. అండగా నిలవడం లేదు. బోనస్ కాదు కదా.. మద్దతు ధర రావడం లేదు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలో రైతులు రోడ్డెక్కితే నీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. కొబ్బరికాయలు కొడుతున్నారు.. కానీ ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. చివరకు వరి ధాన్యాన్ని రూ. 1900కు అమ్ముకుంటున్నారు. రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. మక్క రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. సోయాబీన్ రైతులను పట్టించుకోవడం లేదు. రైతులను రోడ్డు మీదకు తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపురించిందని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్లను అరెస్టు చేస్తున్న పోలీసులు.. కొనసాగుతున్న నిరసనలు!
Vemula Prashanth Reddy | పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయం: మాజీ మంత్రి వేముల
KTR | దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా?: కేటీఆర్