హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా.. వాటిని కొనాలని అధికారులకు ఆదేశాలు అందలేదని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మండిపడ్డారు.
రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోళ్లపై ఎందుకు పెట్టరని, రైతులంటే ఎందుకంత అలుసని నిలదీశారు. మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి.. రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని హితవుపలికారు. దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయవద్దని ఎక్స్ వేదికగా కోరారు.
‘దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా?
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా.. ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే.. ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే!!
రాజకీయాలపై పెట్టిన దృష్టి… ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు?
మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా?
రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి.. రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి..దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండి..’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దసరాకే కాదు..దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా?
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా..ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే..ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే!!
రాజకీయాలపై పెట్టిన దృష్టి…ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు?
మీ… pic.twitter.com/RrZuIK6990
— KTR (@KTRBRS) October 28, 2024