‘పర్యావరణ పరిశుభ్రతలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి’
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, ప్రజలతో మమేకమై అవగాహన కల్పించి పర్యావరణ రక్షణకై వారిని చైతన్యం చేయాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అరుణ ప్రియ అన్నారు.
-ఎంజీయూ వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ
రామగిరి, మార్చి 12 : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, ప్రజలతో మమేకమై అవగాహన కల్పించి పర్యావరణ రక్షణకై వారిని చైతన్యం చేయాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అరుణ ప్రియ అన్నారు. గురువారం యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1, 2 ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణం- పరిశుభ్రత అనే అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటరీ నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వాలంటీర్లు కళాశాల పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. మరోవైపు కళాశాల తరగతి గదుల్లోనూ సైతం శుభ్రం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా ఉంటామన్నారు. వారంలో ఒక రోజైనా కచ్చితంగా శ్రమదానంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులకు సూచించారు.

‘పర్యావరణ పరిశుభ్రతలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి’
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ మహమ్మద్ షరీఫ్, మ్యాతరి ఆనంద్, వివిధ శాఖల అధ్యాపకులు డాక్టర్ వి.శ్రీనివాస్, డాక్టర్ విజయ బాబు, డాక్టర్ మోహన్ రెడ్డి, డాక్టర్ పండరయ్య, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ పనస రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అనిత కుమారి, డాక్టర్ అరవింద్, అనిల్ కుమార్, చక్రి, నాగార్జున, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

‘పర్యావరణ పరిశుభ్రతలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

