Vemula Prashanth Reddy | పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయం: మాజీ మంత్రి వేముల
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. పీఏసీ చైర్పన్ ప్రజాధనం ఖర్చు పెట్టడంలో లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి, ఎనమల రామకృష్ణుడు నాడు పీఏసీ చైర్మన్లుగా ఉన్నారు.
హైదరాబాద్: పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. పీఏసీ చైర్పన్ ప్రజాధనం ఖర్చు పెట్టడంలో లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి, ఎనమల రామకృష్ణుడు నాడు పీఏసీ చైర్మన్లుగా ఉన్నారు. లోక్‌సభలో కూడా గత పదేండ్లుగా ప్రతిపక్ష నాయకులే పీఏసీ చైర్మన్లుగా ఉన్నారు. ఇవాళ కూడా పీఏసీ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించాం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికెపూడి గాంధీ ప్రతిపక్ష సభ్యుడేనని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారన్నారు. ఫిరాయింపుదారులతో సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. జీవన్‌రెడ్డి లేఖపై శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని, ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని మధుయాష్కి గౌడ్ అన్నారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బుల్డోజ్ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గాంధీని కాంగ్రెస్ సభుడిగా ఒప్పుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దాగుడు మూతలు ఆడుతున్నదని విమర్శించారు. ఆ పార్టీలో నాయకులే లేరా అని నిలదీశారు. గాంధీని అడ్డం పెట్టుకుని రేవంత్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి సూచన మేరకు పీఏసీ చైర్మన్‌ను నియమించాలన్నారు.
LIVE : BRS Leaders Press Meet at Telangana Bhavan
https://t.co/3hyA7UGZ32— BRS Party (@BRSparty) October 28, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

