JEE Mains 2025 | జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షలు ఎప్పటి నుంచంటే..?
JEE Mains 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. రెండు సెషన్స్‌గా మెయిన్స్ నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.
JEE Mains 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. ఈసారి కూడా రెండు సెషన్స్‌గా మెయిన్స్ నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. జనవరిలో తొలి సెషన్, ఏప్రిల్‌లో రెండో సెషన్ ఉంటుందని చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ వరకు.. అనంతరం ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది.
సెషన్-1 కోసం సోమవారం (అక్టోబర్ 28) నుంచే అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ చెప్పింది. అప్లికేషన్లు సమర్పించేందుకు నవంబర్ 22 చివరి తేదీ. జనవరి చివరివారంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, సెషన్-2కు సంబంధించి జనవరి 31నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 1నుంచి 8వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష గడువు 3గంటలు కాగా, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో సెక్షన్-ఏలో 20, సెక్షన్-బీలో 5ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌లో 100మార్కుల చొప్పున మొత్తం 300మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ వివరాలు…
సెషన్-1 : ఆన్లైన్ దరఖాస్తులు – 28-10-2024 నుంచి 22-11-2024 రాత్రి 9.00గంటల వరకు.
అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గడువు- 22-11-2024(రాత్రి 11.50గం.ల వరకు)
ఆన్లైన్ దరఖాస్తుల్లో సవరణలు- ఎన్టీఏ వెబ్సైట్లో ఇస్తారు.
సిటీ ఇంటిమేషన్- జనవరి-2025మొదటి వారంలో వెల్లడిస్తారు.
ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు గడువు- పరీక్ష తేదీకి 3రోజుల ముందు.
పరీక్ష తేదీలు- జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య(టెంటటివ్)
ఫలితాలు- ఫిబ్రవరి 12వ తేదీ వరకు.
సెషన్-2
ఆన్లైన్ దరఖాస్తులు- 31-01-2025 నుంచి 24-02-2024 రాత్రి 9.00గం.ల వరకు
అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు- 24-02-2024(రాత్రి 11.50గం.ల వరకు)
సిటీ ఇంటిమేషన్- మార్చి రెండో వారం
ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్- పరీక్షకు మూడు రోజుల ముందు
పరీక్ష తేదీలు- ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8మధ్య(టెంటటివ్)
ఫలితాలు- ఏప్రిల్ 17వ తేదీవరకు
పరీక్ష గడువు…
పేపర్-1(బీఈ/బీటెక్)- 3గంటలు
పేపర్-2(బీ.ఆర్క్)-3గంటలు
పేపర్-2బీ(బీ.ప్లానింగ్)-3గంటలు
బీ.ఆర్క్, బీ.ప్లానింగ్(బోత్)- 3.30గంటలు
ఇవి కూడా చదవండి
- Australia Cricket | టీమిండియాతో సిరీస్‌కే ప్రాధాన్యం.. కెప్టెన్ లేకుండానే టీ20 స్క్వాడ్
- ERC | విద్యుత్ చార్జీల పెoపు ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ
- Bangladesh Test Captaincy | పదేండ్లుగా ఆడుతున్నా.. అతడు వైదొలిగితే నేనే కెప్టెన్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

