మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 10:43:51

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీస్‌ ఉన్నతాధికారులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు ఓటువేశారు. కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ దంపతులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.  

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: సీపీ మహేశ్‌ భగవత్‌

ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరుగుతున్నాయని సీపీ మహేశ్‌ భగత్‌ అన్నారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ సిబ్బంది, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ప్రశాంత వాతావరణం ఉన్నదని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచామన్నారు.