ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : స్పీకర్ పోచారం
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా | బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాన్సువాడ పట్టణ పరిధిలోని 10వ వార్డ్ (చైతన్య కాలనీ) లో నూతనంగా అభివృద్ధి చేసిన చిల్డ్రెన్స్ పార్క్‌కు ప్రారంభోత్సవం చేశారు.17వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోని కల్యాణ మండపానికి,16వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని కల్యాణ మండపానికి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటికే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయి. భవిష్యత్తులో నియోజకవర్గ పరిధిలో నాకు సొంత ఇళ్లు లేదు అనేవారు ఉండకూడదు అన్నదే నా ఆశయం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నియోజకవర్గానికి చేరుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో అన్ని కులాల సంఘాలకు కమ్యునిటీ భవనాలను నిర్మించామని స్పీకర్ తెలిపారు. వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. నియోజకవర్గ పరిధిలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం పరధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
తిమ్మాపూర్ దేవాలయం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.23 కోట్లను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో ప్రధాన ఆలయం అభివృద్ధి, మాడ వీధులు, రాజగోపురాలు, కల్యాణ మండపంతో పాటుగా భక్తులకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..
భర్తను రోకలిబండతో బాది హత్య చేసిన భార్య
Team India: ఇండియన్ టీమ్‌కు గుడ్‌బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్‌కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

