కోల్‌కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన కరోనా రోగుల్లో టీకా తీసుకున్న వారే మూడొంతులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన కరోనా పాజిటివ్ రోగుల్లో మూడొంతుల మంది వ్యాక్సిన్ ఒక డోసు లేదా పూర్తిగా రెండు డోసులు తీసుకున్నవారేనని వైద్యులు తెలిపారు. తేలికపాటి లక్షణాలున్న రోగులు మందులతో కోలుకుంటున్నారని, ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి ఆక్సిన్ సపోర్ట్ అవసరమవుతున్నదని చెప్పారు.
ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో 24 మంది కరోనా రోగులు చేరినట్లు సీఈవో రూపక్ బారువా తెలిపారు. వీరిలో 60 శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారేనని చెప్పారు. వీరిలో 15 మంది ఐసీయూలో ఉన్నట్లు వెల్లడించారు. క్రిటికల్ రోగులకు టీకా తొలి డోసు తీసుకున్న వెంటనే కరోనా సోకి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కోల్‌కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. 13 మంది కరోనా రోగుల్లో 9 మంది టీకా వేయించుకున్నారని పల్మనాలజీ డైరెక్టర్ రాజ ధర్ తెలిపారు. 9 మందిలో ఒకరు పూర్తిగా, 8 మంది ఒక డోసు టీకా తీసుకున్నారని చెప్పారు. అయితే టీకా వేయించుకోని వారి కంటే తీసుకున్న వారిలో ప్రాణ ముప్పు తక్కువేనని అన్నారు. కాగా, నగరంలోని పలు ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

