రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు ఓబీసీ కోటా విషయంలో అధికారులు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో చర్చ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ప్రశ్నోత్తరాలు, భోజన విరామ సమయాన్ని రద్దు చేశారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడంలేదని, చర్చ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించినా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. నాలుగు గంటల పాటు ఈ అంశంపై చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్.. ఓబీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ చేప్టటేందుకు ఏకగ్రీవంగా అంగీకరించిన సభ్యులందరికీ ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఇదో చరిత్రాత్మక బిల్లు అని ఆయన తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి బిల్లు ఊతమిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

