Free Power To Govt Schools | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌పై విద్యుత్‌శాఖ జీవో జారీ చేసింది. మొత్తం 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన ఉచిత విద్యుత్‌పై ప్రకటన చేశారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం కంపెనీలకు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ లేదని.. రాష్ట్ర విద్యా వ్యవస్థ మారాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని.. అంతర్జాతీయంగా పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన సమయంలో చక్కగా సహకరించారని.. ఉపాధ్యాయులు ఎంత గొప్ప వారైతే సమాజం అంత గొప్పగా మారుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
TG High Court | ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక తెలంగాణలో ఐదురోజులు భారీ వానలే..!
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో