TG High Court | ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు
TG High Court | ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం పేర్కొంది.
TG High Court | ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం పేర్కొంది. స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని సచించింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించిన అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవోను పలువురు విద్యార్థులు సవాల్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. సర్కారు జారీ చేసిన ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయా పిటిషన్లపై వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
Read Also :
TG Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక తెలంగాణలో ఐదురోజులు భారీ వానలే..!
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

