పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కాగా, అందులో ఒకరు బంజరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీర స్వామిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పేదలకు ఇండ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం: హరీశ్ రావు
MLA Jagadish Reddy | ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Harish Rao | పాలన పక్కనపెట్టి సుందరీకరణ చేస్తారా.. ప్రజల ఉసురు పోసుకోవద్దు: హరీశ్ రావు